సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (18:18 IST)

పవన్ కల్యాణ్‌కు కావలసింది ఏమిటి?: జనసేనాని ప్రశ్న

pawan kalyan
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ... మీకోసం నలిగిపోతూ వున్నా. దశాబ్ద కాలంగా 2014 నుంచి 2024 వరకూ రాజకీయాలను వదలకుండా వున్నానంటే ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నాకు ఇష్టం. ఈ రాష్ట్రం పచ్చగా కళకళలాడుతుండాలి. రెండు చోట్ల ఓడిపోయి వున్నానంటే తెలుగు నేలపై నాకు పిచ్చి. మన ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికి అన్నపూర్ణ వంటివి. అలాంటి జిల్లాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఉసూరుమనకూడదనే కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసాను.
 
ఒక నదికి ఏముంటుంది అవసరం... దాహాన్ని తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది అవసరం... ఎండలో వున్నవారికి నీడ ఇవ్వాలనే కదా. పవన్ కల్యాణ్‌కు ఏముంటుంది? మీ భవిష్యత్ బాగుండాలనే ఆశే కదా అంటూ భావోద్వేగమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.