బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (08:40 IST)

కృష్ణా జిల్లాలో డయాలసిస్ కోసం 15 ప్రైవేట్ ఆసుపత్రులు

జిల్లాలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న డయాలసిస్ రోగుల కోసం 15 ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్సలు పొందాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా మూలంగా జిల్లాలో లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉన్నారన్నారు. డయాలసిస్ పేషెంట్లు తమ ఆరోగ్య చికిత్సల కోసం ఇబ్బందులు పడకుండా కొన్ని ఆసుపత్రులను గుర్తించామన్నారు.

సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఆశక్తి చూపవద్దని స్థానికంగానే గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ నగరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటే అందుకు కావలసిన డబ్బు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
 
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న నెఫ్రోప్లస్ విభాగంలో నూజివీడులోని ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి మచిలీపట్నం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగ్గయ్య పేటలలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డయాలసిస్ పరీక్షలు కూడా చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. 
 
జిల్లా వారీగా గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...
నగరంలోని రామవరప్పాడులో ఉన్న ఆయుష్ హెల్త్ కేర్,
పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న ఆంధ్రా హైల్ డయాగ్నోస్టిక్, 
భవానీపురంలో ఉన్న ఆంధ్రా ఆసుపత్రి, 
గవర్నర్ పేటలోని ఆంధ్రా ఆసుపత్రి, 
పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి, 
తాడిగడప కామినేని హాస్పిటల్,
సూర్యారావు పేటలోని లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్,
సొంటినేని హాస్పిటల్,
సూర్యారావు పేటలోని శ్రీ అనూ స్పెషాలిటీ హాస్పిటల్,
సనత్నగర్ లోని టైం హాస్పటల్,
సూర్యారావు పేట లో విజయ సూపర్ స్పెషాలిటీ -
హాస్పిటల్ అలాగే గుడివాడలోని అన్నపూర్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
మచిలీపట్నం లో ఆంధ్రా హాస్పటల్స్,
కానూరు లోని నాగార్జున హాస్పటల్,
వినాయకథియేటర్ ప్రక్కన హాస్పిటల్,
లబ్బి పేటలో శ్రీ స్వరూప హాస్పిటల్