సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (14:51 IST)

15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో అరెస్ట్

15 ఏళ్ల బాలికపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలోని తాజంగిలో వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలుడు పాల్పడిన అకృత్యానికి ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. తాజంగి బోయపాడు గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా.. 17 ఏళ్ల బాలుడు ఇంటర్ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి శారీరకంగా కూడా కలుసుకున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. 
 
బాలిక ప్రవర్తనలో అనుమానం రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.