శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 డిశెంబరు 2024 (16:43 IST)

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

perni nani
వారంలో కనీసం రెండుమూడు రోజులకు తగ్గకుండా మీడియా ముందు కనిపించే వైసిపి నాయకుడు పేర్ని నాని ఇపుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తన భార్య పేరుపై వున్న గోదాములో నిల్వ వుంచిన 3,708 బస్తాల బియ్యం మాయమయ్యాయి. దీనితో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపైన మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేసారు.
 
దీనితో అరెస్ట్ భయంతో జయసుధ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు ఈ నెల 16కి వాయిదా పడింది. గోదాములో ఇలా భారీస్థాయిలో బియ్యం మాయమైన దగ్గర్నుంచి పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. శుక్రవారం వైసిపి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా కనిపించలేదు. దీనితో వీరిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.