ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (09:21 IST)

ఏపీ ప్రభుత్వంతో నాలుగు కంపెనీల ఒప్పందం

New districts in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ  పర్యటనలో ఆయన ఐదు పరిశ్రమలకు భూమి పూజ చేశారు. మరో నాలుగు కొత్త కంపెనీలకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపాచీతో పాటు ప్యానెల్ ఆప్కో డిస్‌ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో‌టెక్ కంపెనీలకు ఆయన భూమిపూజ చేశారు. 
 
ఆ తర్వాత ఇదే వేదికపై నుంచి పీఓటీపీఎల్ ఎలక్ట్రానిక్స్, టెక్ బుల్ల్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో సీఎం జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ అధికారులు ఆయా కంపెనీలతో సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబడులు రానున్నాయన్న విషయంపై స్పష్టత లేదు.