శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 6 మే 2019 (19:13 IST)

ప్రియురాలి ఇంట్లోకి వెళ్ళి ప్రియుడి ఆత్మహత్య.. ఎందుకంటే?

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కురబలకోట మండలం అంగళ్ళు పంచాయతీ చింతయ్యగారికోటకు చెందిన సుధాకర్ కుమారుడు శశికుమార్ కమతం పల్లెకు చెందిన ఓ బాలిక యేడాదిగా ప్రేమించుకుంటున్నారు. విషయం కాస్తా బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో ఆరు నెలలుగా బాలిక శశికుమార్‌తో మాట్లాడడం లేదు. అయినా ఇంటి వద్దకు వచ్చి వెళుతుండేవాడు సుధాకర్. 
 
అయితే తమ గ్రామంలో జరిగే తిరునాళ్ళకు తీసుకెళదామని బాలిక ఇంటికి వచ్చాడు శశికుమార్. అయితే బాలిక తాను రానని వంట గదిలోకి వెళ్ళి పాత్రలు కడుక్కుంటోంది. దీంతో శశికుమార్ బాలిక బెడ్రూంలోకి వెళ్ళి ఆమె చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
దీన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబీకులు మాత్రం బాలిక తల్లిదండ్రులే శశికుమార్‌ను చంపేశారని ఆరోపిస్తున్నారు.