శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 6 మే 2019 (19:04 IST)

105 యేళ్ళ బామ్మ ఓటేసింది.. ఎక్కడ..?

ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఎన్నికలు వస్తుందంటే చాలు అధికారులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్న నేపథ్యంలో ఒక శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
జార్ఖండ్ రాష్ట్రం పూజారిబాగ్ నియోజకవర్గంలో 105 యేళ్ళ వయస్సు ఉన్న వృద్ధురాలిని ఆమె కుమారుడు భుజాన వేసుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సిరా గుర్తును చూపించారు. నేడు దేశవ్యాప్తంగా యుపీ, మధ్యప్రదేశ్, జమ్ము, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలో 51 లోక్ సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ జరిగింది.