శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 మే 2019 (17:08 IST)

మంచు విష్ణు విశ్వరూపం అదే... హిసించారంటూ ఓటర్ దర్శకుడు సంచలన ఆరోపణలు

మంచు విష్ణుపై ఓటర్ చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ్యాట‌ర్ ఏంటంటే.. మంచు విష్ణు హీరోగా కార్తీక్ రెడ్డి... ఓట‌ర్ అనే సినిమాని తెర‌కెక్కించాడు. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ రిలీజ్ కాలేదు. అయితే.. తనని విష్ణు మానసికంగా హింసిస్తున్నాడంటూ కార్తీక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
తను తీసిన ‘ఓటర్’ చిత్ర కథకి.. గతంలో మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్ర కథ, కథానాలకు సంబంధం లేకపోయినా.. ఈ కథను అసెంబ్లీ రౌడీ కథకు అడాప్ట్ చేస్తూ తనతో బలవంతంగా సంతకాలు చేయించి తప్పుడు అగ్రిమెంట్స్ చేయించుకున్నారని.. ఇప్పటికీ తనను హీరో విష్ణు, అతని స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డిలు బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు కార్తీక్ రెడ్డి. 
 
ఓటర్ కథ చెప్పినప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయని... ఈ సినిమాకు ‘పవర్ ఫుల్’ అనే టైటిల్‌‌ని రిజిస్టర్ చేయిస్తే... ఓటర్‌గా పేరు మార్చాలని ఒత్తిడి చేశారన్నారు. ఇక సినిమాలో మార్పలు చేయాలని.. కీలకమైన సీన్లు మార్చాలంటూ హీరో విష్ణు ప్రతిదాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దర్శకుడిగా తన బాధ్యతను నిర్వర్తించకుండా పనిచేయడానికి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేశారని చివరికి ‘ఓటర్’ స్క్రీన్ ప్లే క్రెడిట్స్ తనకి ఇవ్వాలని విష్ణు ఒత్తిడి చేశారన్నారు కార్తీక్ రెడ్డి. ఈ వివాదం గురించి విష్ణు ద‌ర్శ‌కుల సంఘానికి ఏమ‌ని స‌మాధానం చెబుతారు అనేది ఆస‌క్తిగా మారింది.