బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 24 జులై 2021 (11:52 IST)

కేసుల నెపంతో అచ్చంనాయుడు పాస్‌పోర్ట్ పెండింగ్!

ఏ దేశ పౌరుడికి అయినా, త‌న పాస్ పోర్ట్ చాలా ముఖ్యం. అది క‌లిగి ఉండ‌టం ప్రాథ‌మిక హ‌క్కు. కానీ, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చంనాయుడు పాస్ పోర్ట్ పెండింగులో పెట్టారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు... ఏపీ టీడీపీ అధ్యక్షుడు.

ఆయ‌న పాస్ పోర్ట్ గ‌డువు ముగిసింద‌ని రెన్యూవ‌ల్ కి అచ్చం నాయుడు అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. కానీ, ఆయ‌న‌పై కేసులు ఉన్నాయ‌ని పాస్ పోర్ట్‌ని పెండింగులో పెట్టారు... పాస్ పోర్ట్ అధికారులు. తన పస్ పోర్ట్ రెన్యువల్ చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు. దీనితో అచ్చెన్నాయుడు పిటిష‌న్ పై విచార‌ణ చేసిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కేసులు ఉన్నాయనే నెపంతో పాస్పోర్ట్ రెన్యువల్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్. దీనికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వివ‌ర‌ణ ఇస్తూ, కేంద్రం నుంచి వివరణ తీసుకొని కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలిపారు.