ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:20 IST)

పవన్ బాహుబలికి మించిన ప్యాకేజీ కోసమే వచ్చారు: జీవిత రాజశేఖర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బాహుబలి సినిమాను మించిన ప్యాకేజీ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని సినీ హీరో రాజశేఖర్ ఆరోపించారు. తాజాగా వైకాపాలోకి తిరిగి వచ్చిన జీవితా రాజశేఖర్ దంపతులు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. 
 
రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ ఓ కాలును సినిమా రంగంలో, మరో కాలును రాజకీయ రంగంలో పెట్టి రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడని, అదే విధంగా సినిమాలను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి రావాలంటూ సూచించారు. 
 
స్థిరమైన వైఖరి లేనటువంటి పవన్ ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేసారు.