గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (07:40 IST)

ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే .. చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక కొరత వలన జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ సీఎం చంద్రబాబు విమర్శయించారు.

ఇసుక కొరత వలనే కార్మికులు ప్రాణాలను తీసుకుంటున్నారని, ఇసుక కొరతను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందని, కార్మికుల ఆత్మహత్యకు ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.

బాధిత కుటుంబాలకు పాతిక లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన అయన తక్షణమే ఉచిత ఇసుక అమల్లోకి తేవాలన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ తరపున కక్ష సహాయం చేస్తామని ప్రకటించారు.
 
రాష్ట్రంలో ఇసుక కొరతతో నిర్మాణ రంగంలోని కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కాగా బాధిత కార్మిక కుటుంబాల టీడీపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది.

కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1,00,000 ఆర్ధిక సహాయం అందించిన మాజీ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం చేసేవరకు వారి తరపున పోరాడతామని హామీ ఇచ్చారు.
 
ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా?
రాష్ట్రంలో ఇసుక లేమితో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు ఒళ్ళు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా అని మాజీ మంత్రి లోకేష్ విమర్శలు చేశారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన లోకేష్ ఆకలి బాధతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… వైకాపా మంత్రులు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా? బాధ్యతలేదా? దీనికంతటికీ మీ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలు, మీ నేతల అక్రమ ఇసుకదందా కారణం కాదా?

ఇసుక సమస్య పరిష్కరించి కార్మికులను ఆదుకోవాల్సిన వారు పుండు మీద కారం జల్లే విధంగా మాట్లాడటం సబబు కాదు. మాటలు తూలిన మంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆత్మహ్యత్యలు చేసుకున్న కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి’ అని ట్వీట్ చేశారు.