Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జమ్మూకాశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం- లాంగ్ లీవ్.. టర్కీలో హనీమూన్‌

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన జమ్మూకాశ్

Written By selvi
Updated: బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (09:04 IST)
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన జమ్మూకాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి, డయ్యూడామన్ ఎస్పీ సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం అట్టహాసంగా జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ తీసుకోనున్నారు. ఇక పెళ్లి పూర్తయ్యాక ఈ నెల 22 నుంచి 25లోపు ఏదైనా ఒక తేదీలో హైదరాబాదులో వివాహ రిసెప్షన్ వుంటుందని టాక్. అనంతరం 26న భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి హనీమూన్‌ కోసం టర్కీ వెళ్తారు. 
 
ఇకపోతే..2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంకు సాధించిన ఆమ్రపాలి.. సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ సర్కారు ఆమెను వరంగర్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. యంగ్ కలెక్టర్ అయిన ఆమ్రపాలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ యువతకు దగ్గరయ్యారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments