శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (16:41 IST)

మందు పంపిణీపై పుకార్లు నమ్మొద్దు.. ఇంకా అనుమతులు రాలేదు : ఆనందయ్య

కరోనా రోగుల పాలిట ప్రత్యక్ష దైవంగా కనిపించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య శుక్రవారం స్పందించారు. తాను మందు పంపిణీ చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. మందు పంపిణీకి ఇంకా అనుమతులు రాలేదని చెప్పారు. 
 
అదేసమయంలో తన ఔషధం పంపిణీపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. శుక్రవారం నుంచి పంపిణీ పునఃప్రారంభం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని వివరించారు.
 
ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తానని, అయినా తనవద్ద ఇప్పుడు మూలికలు తగినంత స్థాయిలో లేవని అన్నారు. తాము ప్రకటించేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక, తొలుత మూలికలు సేకరించుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే మందు తయారీ, పంపిణీ అని వెల్లడించారు.