బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (12:12 IST)

మద్యం సేవించలేదు.. కానీ, కారు వేగం 100 కిమీ... గుర్తు తెలియని ప్రదేశానికి నిషిత్ కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయనతో పాటు.. ఆయన స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయనతో పాటు.. ఆయన స్నేహితుడు రాజా రవివర్మలు మృతిచెందాడు. 
 
నిషిత్ మృతదేహానికి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో నిషిక్ మద్యం సేవించలేదని వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రమాదం జరిగినపుడు కారు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టివుంటుందని, అందువల్లే కారు సీటులో ఉన్న నిషిత్ ఊపిరితిత్తులు పంక్చర్ అయ్యాయని వైద్యులు తేల్చారు. అందువల్లే ప్రమాదం జరిగిన వెంటనే వారిద్దరు మృతి చెందారని వైద్యులు తెలిపారు. 
 
ఇదిలావుండగా, హైదరాబాద్, జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో మెట్రో రైల్ పిల్లర్‌ను ఢీ కొన్నకారును పోలీసులు అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియడంతో మీడియా సంస్థలన్నీ ప్రమాదానికి గురైన కారును వెతికే ప్రయత్నం చేశాయి. అయితే కారు మాత్రం కనిపించలేదు.
 
దీంతో పోలీసులను అడుగగా, తమకు తెలియదని సమాధానం చెప్పారు. ప్రత్యక్ష సాక్షులతోపాటు, ఆ పరిసరాల్లోని వారిని అడుగగా... కారును ఎవరో ప్రైవేటు వ్యక్తులు తరలించారన్న సమాధానం వచ్చింది. దీంతో మరింత లోతుగా ఆరాతీసిన మీడియా సంస్థలు సదరు కారును రహమత్ నగర్ అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ వెనుకనున్న పారిశ్రామిక విద్యాసంస్థకు చెందిన ఖాళీ ప్రదేశంలో గుర్తించాయి. కారును అంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.