Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 500 దాటిన కరోనా- 24 గంటల్లో 567 కేసులు

Written By సెల్వి
Updated: బుధవారం, 27 అక్టోబరు 2021 (18:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వరకు తగ్గిన కరోనా కేసులు ప్రస్తుతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజున నాలుగు వందలకు దిగువన కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 500 దాటింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 567 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
 
దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,64,854కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఎనిమిది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,364 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4777 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 39,545 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,93,65,385 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 437 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,45,713 లక్షలకు చేరింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments