దేశంలో కంటే రాష్ట్రంలోనే రోడ్డు ప్రమాదాలు అధికం : డీజీపీ
2019 వార్షిక నివేదికను ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ వివరించారు. పోలీస్ శాఖలో మార్పుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఈ సంవత్సరం పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసింది. వృత్తిపరమైన పోటీల్లో దేశ స్థాయిలో 7 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయిని తెలిపారు.
2018తో 2019ను పోల్చితే కొన్ని కేసులు బాగా పెరిగాయి. కొన్ని తగ్గు ముఖం పట్టాయి. రోడ్డు ప్రమాదాలు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా ఉండటం బాధాకరమని చెప్పుకొచ్చారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ చరిత్రాత్మకం అని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు పోలీసు శాఖ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
ఇక ఇసుక పాలసీ వల్ల ఇసుక చోరీ కేసులు 140 శాతం పెరిగాయని తెలిపారు. మహిళ భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిననట్టు తెలిపారు. దిశ యాక్టుకు ప్రభత్వం చర్య తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ యేడాదిలో సైబర్ నేరాలు 53 శాతం మేరకు పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 2020లో నేరాల సంఖ్య తగ్గించి సేఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల సహకారంతో నక్సలిజం చర్యలు తగ్గుముఖంకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.