గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:23 IST)

నువ్వు నేనూ అన్ని మూసుకొని వారి మాట విందాం బ్రదరూ...

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇదే స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయి ప్రముఖ సినీ నిర్మాత, బడా పారిశ్రామికవేత్త పీవీపీ వరప్రసాద్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరింత ముదిరిపాకానపడింది. దీంతో వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ మరోమారు కేశినేని నాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాజాగా ఎంపీ కేశినేని నాని టార్గెట్‌ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన పీవీపీ, 'రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బ్రదరూ... ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తింస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం కేశినేని నాని' అని అన్నారు. ఈ ట్వీట్‌పై కేశినేని స్పందించాల్సివుంటగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.