ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ భారీ కరెంట్ షాక్: కరెంట్ బిల్లులు చూసి ఫీజులు పీకేసుకోవాల్సిందే....
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ భారీ కరెంట్ షాకిచ్చింది. సామాన్య ప్రజలపై అధిక భారం పడేవిధంగా విద్యుత్ డిస్కంలు ప్రకటించిన విద్యుత్ శ్లాబులను చూసి ప్రజలు షాక్ తింటున్నారు. ఇప్పటికే 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఏడోసారి భారీ వడ్డన చేసేందుకు సమాయత్తమైంది.
పెంచిన విద్యుత్ చార్జీలను చూస్తే సామాన్యులు తమ కరెంట్ ఫీజులు పీకేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలపై సమీక్షించి పేదలపై భారం మోపకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరల వివరాలు ఇలా వున్నాయి:
30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు పెంపు
31-75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు
76-125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.40 పెంపు
126-225 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.57 పెంపు
226-400 యూనిట్లకు రూ.1.16 పైసలు పెంపు
400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు