ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:27 IST)

ఏపీలో తగ్గిన మద్యం ధరలు - బీరు బాటిల్‌పై రూ.30 తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.30 మేరకు తగ్గింది. అలాగే, ఇతర బ్రాండ్లపై కూడా ధరలు బాగానే తగ్గాయి. ఈ తగ్గిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
మద్యం బ్రాండ్లపై ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌ వంటి పన్నుల్లో హేతుబద్ధత తీసుకొస్తూ శనివారం రెవెన్యూ శాఖ ప్రత్యేక అదనపు కార్యదర్శి రజత్ భార్గవ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. బీర్లపై 10 నుంచి 20 శాతం తగ్గనుంది. 
 
స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గించారు. మొత్తంగా చూసుకుంటే బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. అలాగే వచ్చే వారంలో అన్ని రకాల విదేశీ బ్రాండ్లను మద్యం షాపుల్లో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.