శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (09:30 IST)

కడప కమలాపురం వార్డులో వైకాపా బోణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా బోణీ కొట్టింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి చేపట్టారు. ఇందులో అధికార పార్టీ అయిన వైకాపా బోణీ కొట్టింది. 
 
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కమలాపురం మున్సిపాలిటీ నుంచి ఈ ఫ‌లితం వెల్ల‌డైంది. క‌మాలపురంలోని 11వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి స‌లీల 250 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది. అలాగే అధికార వైసీపీ ప‌లు మున్సిపాల్టీల‌లో కొన్ని వార్డుల‌లో అధిక్యంలో ఉంది. కుప్పంలో ఒక వార్డులో వైసీపీ అధిక్యంలో ఉంది.
 
అలాగే నెల్లూరు కార్పోరేష‌న్‌లో కూడా 8 స్థానాల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది. అలాగే దాచేప‌ల్లి, ద‌ర్శిల‌లో కూడా ఒక్కో వార్డుల‌లో అధికార పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీటితో పాటు గుర‌జాలలో 6 వార్డుల‌లో వైసీపీ అధిక్యంలో ఉంది.