సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (12:51 IST)

నేను క్రిస్టియన్‌ కాదు.. 100% శాతం హిందువునే: వంగలపూడి అనిత

టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అనిత వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి తాను క్రిస్టియన్‌కాదని

టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అనిత వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసి తాను క్రిస్టియన్‌కాదని.. నూటికి నూరుపాళ్లు హిందువునని చెప్పారు.


తన ఇంట్లో తులసి కోట, పూజా మందిరం కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ తెలిపారు. తాను ఎస్సీ మాదిగకు చెందినట్టు తన స్టడీ సర్టిఫికెట్లలో ఉందంటూ వాటిని చూపించారు. తన ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోలు, తులసి కోట, దేవుడి గదిని మీడియాకు చూపించారు. 
 
కాగా అనిత క్రిస్టియానిటీ పాటిస్తానని.. ఆమె బ్యాగులో.. కారులో ఎప్పటికీ బైబిల్ వుంటుందనే వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ క్రిస్టియన్‌ను టీటీడీ పాలక మండలిలోకి ఎలా తీసుకుంటారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

అనిత నియామకంపై తీవ్ర దుమారం చెలరేగడంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందులోని నిజానిజాలేమిటో చూడాలని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.