మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (12:30 IST)

కరోనా మందులను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.. రెడ్ హ్యాండెడ్‌గా..?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా సరే కొందరు అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా కరోనా మందులను కూడా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో పక్కదారి పట్టిన రెమిడిసివర్ ఇంజక్షన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బయట వ్యక్తులకు అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది దొరికిపోయారు.
 
ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక నర్స్, అంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరూ భార్యాభర్తలు అని గుర్తించారు. ఇక విశాఖ జిల్లాలో కూడా ఇవే జరుగుతున్నాయి. రెమిడీసేవర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాపై డ్రగ్ కంట్రోల్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
 
రాకేష్, బ్రహ్మాజీ అనే వ్యక్తుల నుంచి ఆరు ఇంజక్షన్లు, 44 వేల నగదు డ్రగ్ కంట్రోలర్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసారు. డ్రగ్ కంట్రోలర్ అధికారులు కళ్యాణి, సునీత నిఘా పెట్టి పట్టుకున్నట్లు వెల్లడించారు