జూన్ 16వ తేదీతో ముగియనున్న ఏపీ అసెంబ్లీ గడువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గడువు జూన్ నెల 16వ తేదీతో ముగియనుంది. ఈ లోపు కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఇందులోభాగంగా, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
మూడేళ్ల కంటే ఎక్కువకాలం ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులనూ కూడా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింగ్, ఒడిశా రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ముఖ్యంగా, ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయని కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కాగా, 2024లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందు ఈసీ చర్యలు చేపట్టింది. అయితే, ఏపీ అసెంబ్లీ గడువు మాత్రం జూన్ 16వ తేదీన ముగుస్తుందని పేర్కొంది.