1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (10:24 IST)

అమరవీరుడు సాయితేజ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిత్తూరుకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ ఉన్నారు. ఈ రోజు సాయితేజ పార్థీవ దేహం చిత్తూరుకు రానుంది. ఆయన చేతిపై పచ్చబొట్టు ఆధారంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

 
ఈ నేపథ్యంలో సాయి తేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సరిహద్దులో ఉగ్రవాదులతో పోరాడటంలో చేసిన శౌర్యం చాలా ప్రశంసనీయమని, మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.