బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (19:41 IST)

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ కానుక .. ఆ గిఫ్టు వారికి మాత్రమే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కానుక ప్రకటించారు. 14 రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకున్న కరోనా వైరస్ రోగులకు రూ.2 వేలు ఆర్థికసాయం చేయాలని ఆదేశించారు. 
 
కరోనా వైరస్, కట్టిడి చర్యలు, కరోనా రోగులు తదితర అంశాలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 రోజుల క్వారంటైన్‌లో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే వారికి వాళ్లు పాటించాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టంగా చెప్పాలని సూచించారు. 
 
అలాగే, క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తులు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు చెప్పాలని ఆదేశించారు. 
 
అలాగే, కరోనా అనుమానితులు ఎవరైతే క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజుల గడువు పూర్తి చేసుకున్నారో వాళ్లందరికీ రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన అధికారులను అందించారు.