Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన

Written By ఠాగూర్
Updated: శనివారం, 26 ఫిబ్రవరి 2022 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని భావిస్తుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులకు సూచించారు. 
 
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 13 జిల్లాలను 26 జిల్లాలుగా వేరు చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా అరకు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా విడిపోనుంది. ఇందులోభాగంగా, ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ స్పందించారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాట్లపై అభ్యంతరాలు స్వీకరణకు మార్చి 3వ తేదీ తుది గడువు అని వెల్లడించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుంచి 1,600 అభ్యంతరాలు అందాయని అన్నారు. ఈ అభ్యంతరాలను ఉన్నత స్థాయి కమిటి పరిశీలిస్తుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి, సమీక్షించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

అన్నీ చూడండి

Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌

Nara Lokesh: రాయలసీమ నేపథ్యాన్ని రణబాలి ట్రైలర్ లో సహజంగా చూపారు : నారా లోకేష్

Prabhas vs Salman: మార్చి 2027లో పోరుకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఫౌజీ, సల్మాన్ మాన్‌స్టర్

Rajmouli Birthday: ప్రమాణాలు, కష్టపడేతత్త్వంతో ఎదిగిన ఎస్.ఎస్. రాజమౌళి కి ప్రముఖుల శుభాకాంక్షలు

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

తర్వాతి కథనం
Show comments