Dharma Sangrah

వాట్సాప్ లో దూషించినా చర్యలు తప్పవు: డీజీపీ హెచ్చరిక

Written By ఎం
Updated: బుధవారం, 3 జూన్ 2020 (19:24 IST)
సోషల్ మీడియా మీద గట్టి నిఘా ఏర్పర్చామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బుధవారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవాలు అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వం మీద గాని ప్రభుత్వ అధికారుల మీద కించపర్చుతూ  పలు వ్యాఖ్యలు చేస్తే  కేసులు నమోదు చేస్తామని అన్నారు.అంతేకాక సోషల్ మీడియాలో మహిళల చిత్రాలను పంపించినా అసభ్య వ్యాఖ్యలు మాట్లాడినా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషించినా ,క్రిమినల్ పేర్లను సంబోదిస్తూ వ్రాసినా కూడా కేసులు నమోదుచేస్తామని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఒక వ్యక్తి గురించి కించపర్చుతూ వ్యాఖ్యలు చేసి తొలిగించినా కేసులు నమోదు చేస్తామని, తమ దగ్గర ఐటీ టెక్నాలజీ ఉందని దీనివలన తొలిగించిన మెసేజ్ లను కూడా పరిగణంలోనికి తీసుకుని కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

వాట్సప్ గ్రూపులలో కూడా నిరాధారమైన వార్తలు వ్రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని డిజీపీ గౌతం సవాంగ్ అన్నారు.వాట్సప్ గ్రూపులలో వ్యక్తి గత దూషణలు చేస్తూ సంభాషించినా, దుర్బషలాడినా  గ్రూప్ అడ్మిన్ తో పాటు గ్రూప్ సభ్యుల మీద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నిరాధారమైన వార్తలు వ్రాస్తే  9071666667 ఈ నెంబర్ కు సంప్రదించి ఆ వార్త నిజమో కాదో పరిశీలించుకోవచ్చని సూచించారు.లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని దీని కట్టడికి అన్ని కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments