శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (22:01 IST)

సెప్టెంబరు ఒకటో తేదీన ఛలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు

chalo vijayawada
ఉద్యోగ సంఘాలు మరోమారు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సీపీఎస్ పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. 
 
సీపీఎస్‍‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించిన చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం తిరిగి పాతపాటే పాడిందని, సీపీఎస్ కంటే జీపీఎస్ ఎంతో ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. జీపీఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దనే విషయాన్ని ప్రభుత్వం సంప్రదింపుల కమిటీకి తెలిపినట్టు చెప్పారు. 
 
అందువల్ల సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను తిరిగి అమలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సీపీఎస్‌లో వచ్చిన సవరణను ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. హామీ ఇచ్చిన మేరకు ఓపీఎస్  విధానాన్ని పునరుద్ధరించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వారు పేర్కొన్నారు.