శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:05 IST)

రఘురామపై ఎస్సీఎస్టీ కేసు - ఫిర్యాదుదారునికి నోటీసులు

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసుపై హైకోర్టుపై స్టే విధించింది. అదేసమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటిసులు పంపాలని ఆదేశించింది. ఎస్సీలను రఘురామరాజు కులం పేరుతో దూషించారంటూ వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అయితే, ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసు పెట్టారంటూ హైకోర్టుకు రఘురామకృష్ణం రాజు తీసుకెళ్ళారు. ముఖ్యంగా, రఘురామరాజు ఎలాంటి దూషణలకు పాల్పడకపోయినప్పటికీ కేసు నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. 
 
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన రఘురామ ఇపుడు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే.