శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (11:18 IST)

టీడీపీకి హోంమంత్రి చినరాజప్ప రాజీనామా... ఎందుకంటే..

తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, కేబినెట్‌లోనే కీలక హోంశాఖ పదవిలో ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట

తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, కేబినెట్‌లోనే కీలక హోంశాఖ పదవిలో ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడం, హోంమంత్రిని కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడుతూ వస్తున్నారు.
 
ఇది అందరికీ తెలిసిందే. ఒక శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖపై పట్టు ఏర్పరచుకోవాలి. కానీ నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పటివరకు తన శాఖ గురించి పూర్తిగా చినరాజప్పకు తెలియదంటూ కొంతమంది మంత్రులు మాట్లాడుకోవడం హోంమంత్రి విన్నారట. 
 
అంతేకాదు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళారట. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని చినరాజప్పను తేల్చి చెప్పారట. కనీసం తాను చెప్పినదానికన్నా మంత్రులను అడగాల్సిన బాధ్యత ఉన్న సీఎం తనను తక్కువ చేసి మాట్లాడడం చినరాజప్పకు ఏ మాత్రం ఇష్టం లేదట. 
 
దీంతో అలకపాన్పు ఎక్కి పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చేసినట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ప్రస్తుతానికి టిడిపి నుంచి దూరమవుతున్నా.. ఆ తరువాత ఏదో ఒక పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు హోంమంత్రిని బుజ్జగించేందుకు ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపారట.