గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (12:29 IST)

తేడావస్తే దబిడి దిబిడే.. బాలకృష్ణకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

rk roja
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికారపక్ష నేతలు ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీల నేతలు మరోవైపు విమర్శలు చేసుకుంటున్నారు. 
 
ఈ పేరు మార్పుపై ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా, వైకాపా నేతలు తమదైనశైలిలో గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి రోజా రంగంలోకి దిగారు. తేడా వస్తే దబిడిదిబిడే అంటూ హెచ్చరించారు.
 
"బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ'గన్' అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడిదిబిడే అంటూ ట్వీట్టర్ వేదికగా చెలరేగిపోయారు. 
 
ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. 
 
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వివాదంపై వివిధ పార్టీ నేతలు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు.