Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇండియా టుడే సర్వేలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగ

Written By selvi
Updated: శనివారం, 15 సెప్టెంబరు 2018 (11:02 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందని సర్వేలో పేర్కొంది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43శాతం మంది ఓటేశారు. చంద్రబాబుకు 38శాతం, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. 
 
ఈ నెల 8వ తేదీ నుంచి 12 తేదీల్లో ఐదు రోజాల పాటు జరిగిన ఈ సర్వేలో దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన ఫర్వాలేదని 18 శాతం మంది వ్యాఖ్యానించారు.
 
2019 ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్‌ వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని తేలింది. 
 
ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ''పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌'' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43శాతం మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని సీనియర్ జర్నలిస్టులు తెలిపారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments