శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:19 IST)

శివాజీ చెప్పినట్టుగానే 'ఆపరేషన్ గరుడ'... బాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్...?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కేంద్ర స్థాయిలో ఆపరేషన్ గరుడ పేరుతో కుట్ర జరుగుతోంటూ సినీ నటుడు శివాజీ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కేంద్ర స్థాయిలో ఆపరేషన్ గరుడ పేరుతో కుట్ర జరుగుతోంటూ సినీ నటుడు శివాజీ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాబ్లీ కేసులో చంద్రబాబు రెండు మూడు రోజుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను ధర్మాబాద్ కోర్టు జారీ చేయనుందే వార్త ఇపుడు హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ నోటీసు అంశం తెరపైకి రావడం గమనార్హం.
 
చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా చంద్రబాబుకు కేంద్రం నోటీసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని శివాజీ వెల్లడించారు.
 
ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా గత 2010లో జరిగిన బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీచేయనుంది. ఇది ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ కేసు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, ఏపీకి ముడిపడి ఉంది. నిజానికి అప్పట్లో చంద్రబాబుపై కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న సమయంలో ఇప్పడు ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం కొత్త చర్చకు దారితీసింది.
 
చంద్రబాబు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ కేసును కేంద్రంలోని ఏదైనా సంస్థకు అప్పగిస్తారా.. అనే అంశంపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై న్యాయనిపుణుల సలహాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్నందున కోర్టుకు హాజరైతే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.