శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 మార్చి 2020 (22:54 IST)

మనస్సున్న మారాణి రోజా, రెండు చేతులెత్తి దణ్ణం పెట్టారు

రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఇలా గొప్ప వారిని పొగుడుతూ ఉంటాం.. అయితే అలాంటి మంచి పని ఆడవారు చేస్తే మహరాణి అని పొగడ్తలతో ముంచెత్తుతుంటాం. నగరి ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం అదే పని చేశారు. మరోసారి తనలోని దయాగుణాన్ని చాటుకున్నారు. 
 
నగరి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి పుదుప్పేటకు చెందిన సరస్వతి అనే మహిళ వచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 వాహనం పనిచేయడంలేదు. మరమ్మత్తులకు గురైంది. దీంతో రోజా దృష్టికి స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్ళారు.
 
ఏ మాత్రం ఆలోచించకుండా రోజా నేరుగా తన కారును పంపింది. తిరుపతిలోని మెటర్నరీ హాస్పిటల్‌లో సరస్వతిని అడ్మిట్ చేయమని సొంత కారును ఇచ్చి పంపించారు రోజా. అంతేకాకుండా తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రికి స్వయంగా ఫోన్ చేసి వైద్యులతో ఆమె మాట్లాడారు. రోజా దయాగుణాన్ని చూసిన స్థానికులు రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టారు.