శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 28 మార్చి 2020 (17:34 IST)

హ్యాట్సాఫ్ రోజా, ఏం చేశారంటే?

సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి దయాగుణాన్ని చాటుకున్నారు. గత కొన్నిరోజుల ముందు నిండుగర్భిణిగా ఉన్న మహిళ నగరి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం.. ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో తన సొంత కారులో తిరుపతికి గర్భిణిని పంపించారు రోజా. 
 
అయితే మళ్లీ మరోసారి తన దాతృత్వాన్ని చూపారు. కరోనా వైరస్ మహమ్మారిలా మారుతున్న సమయంలోను ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు రోజా ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. వారికొక్కరికే కాదు పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బందికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు.
 
అంతేకాకుండా దాతల నుంచి విరాళాలు సేకరించి పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు బియ్యం, పప్పు దినుసులను అందించారు రోజా. నగరిలో ఈరోజు పారిశుధ్య కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు.
 
విపత్కర పరిస్థితుల్లోను మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులు నిజంగా గొప్పవారని, అలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవడం మన ధర్మమని చెప్పారు రోజా. మరింతమంది దాతలు ముందుకు వచ్చి రోడ్లపై ఉన్న నిరుపేదలు, అనాధలు, అభాగ్యులు, నిరాశ్రయలకు తమ వంతు సహాయం చేయాలని.. కడుపు నిండా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు రోజా.