గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (10:41 IST)

ఏపీలో గ్రూప్-IV జాబ్స్: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
 
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు జనవరి 28 తుది గడువుగా ఇచ్చారు. 
 
మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 19తో ఈ గడువు ముగియనుంది. అయితే అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును పొడిగించింది.