గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (10:31 IST)

మావోయిస్టు కీలక నేతల అరెస్ట్

మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సబ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సబ్యురాలు గంగి మాది లను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద  పోలీసులు అరెస్టు చేశారు.

దీనికి సంబందించిన చింతపల్లి ఎఎస్‌పీ సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్‌ సుమారుగా 35 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి.

దీనికి తోడు  బెల్లం నారాయణస్వామి అలియాస్‌ నందు అలియాస్‌ ఆజాద్‌ భార్య కలిమెల ఏరియా కమిటీ సబ్యురాలు గంగి మాది అలియాస్‌ పూల్ బత్తిని కూడా అరెస్టు చేసినట్లు ఎఎస్‌పీ తెలిపారు. ఈమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30కి పైగా కేసులు ఏవోబీలో నమోదయ్యాయి.

గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఎఎస్‌పీ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎఎస్‌పీ తెలిపారు.