నేటి నుంచి అలిపిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ నవంబరు 20 నుండి 25వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగనుంది.
ఇందులో భాగంగా నవంబరు 21వ తేదీ యాగశాలలో ఉదయం 9.00 నుండి 11.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబరు 22న ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు కుంభరాధన, ఉక్త హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
నవంబరు 23వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అష్టబంధన పూజ, సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబరు 24వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు కుంభరాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తారు.
నవంబరు 25వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు హోమాలు, ఉదయం 9 నుండి 10.30 గంటల మధ్య మహా పూర్ణాహూతి, ధనుర్ లగ్నంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, పరివార దేవతలకు కుంభర్చాన, విమాన సంప్రొక్షణ జరుగుతుంది.