బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (08:29 IST)

గుంటూరులో అరాచకం : మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ అరాచకం జరిగింది. మానసిక వికలాంగురాలిపై ఓ కామోన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కూడా కట్టుకున్న భార్య సహకారంతో జరగడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని గుంటూరు రాజీవ్‌ గాంధీ నగర్‌ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక మానసిక వికలాంగురాలుగా జీవిస్తోంది. ఈమె తాతకు స్నేహితుడైన చిట్టిబాబు అనే వ్యక్తి బాలిక ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. 
 
ఈ క్రమంలో చిట్టిబాబు భార్య ఇంటికి వచ్చి బాలికకు జడ వేస్తానని తీసుకెళ్లి ఆమెను తన భర్తను గదిలోకి పంపి బయట కాపలా ఉండేది. ఈ విధంగా చిట్టిబాబు అనేకసార్లు బాలికపై అత్యాచారం చేశాడు. చిట్టిబాబు, అతని భార్యపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.