బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:01 IST)

లలిత్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం.. ఏడుగురి అరెస్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్‌పూర్‌లో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. బాధితురాలి తండ్రి లలిత్‌పూర్‌ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు తిలక్‌ యాదవ్, బహుజన సమాజ్‌ పార్టీ దీపక్ అహిర్వార్‌ను, మహేంద్ర దూబే అనే ఇంజినీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో మొత్తం 28 మందిపై మైనర్‌ బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డారంటూ మైనర్ బాలిక పోలీసులకు తెలిపింది. అత్యాచార నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. 
 
ఈ కేసులో తమ పార్టీ నాయకుడు అరెస్ట్‌ కావడంతో సమాజ్‌వాద్‌ పార్టీ లలిత్‌పూర్‌ జిల్లా యూనిట్‌ను రద్దు చేసింది. నిందితులపై సెక్షన్ 376 డి, అత్యాచారం, 354, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆరేళ్ల వయసులోనే బాధితురాలిని ఆమె తండ్రి ఆశ్లీల వీడియోలను చూపించి లైంగికంగా హింసించడం మొదలు పెట్టాడు. ప్రధాన నిందితుడు అయిన బాధితురాలి తండ్రి.. మైనర్‌ కుమార్తెను స్కూల్‌ నుండి తీసుకువచ్చే దారిలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత మత్తులో ఉన్న ఒక వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాలతో బయటపడ్డానని మైనర్‌ బాలిక తెలిపింది. అయితే ఇదంతా హోటల్‌లోని పలు గదుల్లో జరిగిందని, ప్రతిసారీ ఒక కొత్త వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.