ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:11 IST)

మీ బహిష్కరణల సంగతేమిటి?: అచ్చెన్నాయుడు ప్రశ్న

టీడీపీ ఎన్నికల బహిష్కరణను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మూడేళ్ళు అసెంబ్లీని బహిష్కరించారు.

2013లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించారు. అదే ఏడాది కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలను బహిష్కరించారు. 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరించారు. 2018లో తెలంగాణ ఎన్నికలకు తోక ముడిచారు.

2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తోక ఎందుకు ముడిచారు? తొమ్మిదేళ్ళ నుంచి జగన్‌ రెడ్డి తన సీబీఐ విచారణను ముందుకు సాగనీయకుండా బహిష్కరించాడు.

ఇన్ని బహిష్కరణలు మీ వెనుక పెట్టుకొని పెద్ద పుడింగిలాగా బిల్డప్‌ ఇవ్వకు, అసహ్యంగా ఉంటుంది సాయిరెడ్డి’’ అంటూ అచ్చెన్న శుక్రవారం ట్వీట్‌ చేశారు.