బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:53 IST)

నేటి నుండి ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ మరోసారి లాక్‌డౌన్‌ను విధించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ.. మూడవసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లకూడదని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో లాక్‌డౌన్‌ ప్రకటించాల్సి వచ్చింది.

శనివారం నుండి ఈ లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ సంక్షోభాన్ని నివారించడంతో పాటు...కొత్త ఉత్ప్రేరకం కారణంగా కేసులు పెరగకుండా నిరోధిచడం, హాట్‌స్పాట్లలో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని మాక్రాన్‌ పేర్కొన్నారు.

అదే సమయంలో టీకాలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. విరామ తీసుకోకుండా....సెలవులు కూడా తీసుకోకుండా..శని, ఆదివారాల్లో టీకాలు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దేశంలో శుక్రవారం 46,677 కేసులు నమోదయ్యాయి.

గత వారం కన్నా 6.2 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అదే సమయంలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రానున్న నాలుగు వారాల పాటు దేశ వ్యాప్తంగా అనవసరమైన దుకాణాలు మూతపడనున్నాయి.

పాఠశాలలు పూర్తిగా మూతపడగా...యూనివర్శిటీ విద్యార్థులు వారంలో ఒక్కసారి మాత్రమే తరగతులకు హాజరయ్యే అవకాశం కల్పించారు. బహిరంగ కార్యకలాపాలు పరిమితం చేశారు.

అదేవిధంగా పార్కు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం విధించారు. ఈస్టర్‌ నేపథ్యంలో ప్రాంతాల మధ్య ప్రజా రవాణా, ప్రజలు గుంపులు కట్టడంపై మాక్రాన్‌ ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించలేదు.