గుంటూరులో కలకలం : బీటెక్ అమ్మాయిని నడిరోడ్డుపై కత్తితో పొడిచిన.. .
జిల్లా కేంద్రమైన గుంటూరులో కలకలం చెలరేగింది. ఓ బీటెక్ అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడో యువకుడు. గుంటూరు కాకాని రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో ఆ అమ్మాయి బీటెక్ మూడో ఏడాది చదువుతున్నట్లు గుర్తించారు. యువతిని ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండగా, ఆమె తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
కాగా.. విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. నిందితుడి కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.