Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురుదెబ్బ!

Written By ఎం
Updated: సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:24 IST)
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.

పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు.

హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందాడు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీ మద్దనకుంటలోనూ టిడిపికి పరాభవం తప్పలేదు.

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments