మిమ్మల్ని మార్చడానికి పంచభూతాలున్నాయ్, తస్మాత్ జాగ్రత్త: వైసిపిపై బాలయ్య ఫైర్
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అనేది మార్చేయడానికి అదేమీ పేరు మాత్రమే కాదు, ఓ సంస్కృతి, నాగరికత, తెలుగు జాతి వెన్నెముక అన్నారు. ఆనాడు వైస్సార్ విమానాశ్రయం పేరు మారిస్తే ఈరోజు కుమారుడు వచ్చి యూనివర్శిటీ పేరు మార్చారు.
ఆ మహనీయుడు పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతున్న నేతలున్నారు... పీతలున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మిల్ని మార్చడానికి ప్రజలు వున్నారు, పంచ భూతాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త అన్నారు.