సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:31 IST)

ఎన్టీఆర్ పేరు మార్పు తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా!

ap assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటిగా పేరు మార్చారు. దీనిపై టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఆ గందరగోళం మధ్యే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు కోసం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల్లో మొత్తం 9 బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. 
 
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుల్లో ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పున‌కు సంబంధించిన బిల్లుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ స‌వ‌ర‌ణ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లేబ‌ర్ వెల్ఫేర్ ఫండ్ స‌వ‌ర‌ణ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీతాలు, పెన్ష‌న్ చెల్లింపులు, తొల‌గింపుల అన‌ర్హ‌త స‌వ‌ర‌ణ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీసెస్‌కు నియామ‌కాల నియంత్రణ‌, స్టాఫ్ ప్యాట‌ర్న్‌, పే స్ట్ర‌క్చ‌ర్స్ స‌వ‌ర‌ణ బిల్లు, ఏపీ సీఆర్డీఏ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్‌, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీస్ స‌వ‌ర‌ణ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మునిసిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న బిల్లులు ఉన్నాయి.