శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:09 IST)

దేశంలో ఫోర్త్ వేవ్ సంకేతాలు - ఒక్క రోజురోనే 100 శాతం కేసుల పెరుగదల

coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నాలుగో దశ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఒక్క రోజులోనే కొత్త కేసుల పెరుగదలలో వంద శాతం పెరుగదల కనిపించడమే. నిజానికి గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు వెయ్యి లోపుగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. 
 
గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపు 90 శాతం మేర పెరిగింది. 
 
మరోవైపు, కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 62 బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ... అంతకు ముందు రోజులో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. 
 
ఇక రోజు వారీ పాజిటివిటీ రేటు 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా... మరణాల సంఖ్య 5,21,965కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి.