సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (18:33 IST)

తిరుమలలో అద్భుతం... శివనామాలుగా మేఘాలు

moon
తిరుమలలో అద్భుతం  జరిగింది. తిరుమల వెంకన్న ఆలయంలో చోటుచేసుకున్న ఈ అద్భుతంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఆకాశంలో శివనామాల మధ్య చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఏర్పడిన తెల్లని మేఘాలు విభూతితో తీర్చిదిద్దిన శివనామాలుగా భక్తులకు దర్శనమిచ్చాయి. 
 
ఈ విభూతితో తీర్చిదిద్దిన శివనామాల మధ్య చంద్రుడు తెల్లని బొట్టులా దర్శనమిచ్చాడు. తిరుమల  ఆలయ రక్షకుడు శివుడని మన పురాణాలు చెప్తున్న నేపథ్యంలో శివనామాల్లా మేఘాలు.. నామాల మధ్య తెల్లని బొట్టులా చంద్రుడు దర్శనమివ్వడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు