1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 మే 2024 (11:23 IST)

భూమా అఖిలప్రియ బాడీగార్డును కారుతో ఢీకొట్టి హత్యాయత్నం - Live video

Bhuma Akhilapriya's bodyguard was hit by a car
ఎన్నికలు ముగిసినా అల్లర్లు ఆగడంలేదు. అక్కడక్కడా కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మరో ఘటన చోటుచేసుకుంది. నిన్నరాత్రి తెదేపా మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ పైన హత్యాయత్నం జరిగింది. వేగంగా కారుతో ఢీకొట్టారు.

ఆ తర్వాత కారు నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి కింద పడిని నిఖిల్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపుగానే గాయపడిన నిఖిల్ పైకి లేచి పరుగుపెట్టాడు. వారంతా ఇంటికి సమీపించి ప్రతిఘటన ఎదురవడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ దారుణానికి పాల్పడ్డవారు ఎవరో తెలియాల్సి వుంది.