Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జగన్‌కు బీహార్‌ సీఎం ఫోన్.. ఎందుకో తెలుసా?

Written By ఎం
Updated: శనివారం, 12 సెప్టెంబరు 2020 (07:16 IST)
బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఫోన్‌ చేసినట్లు తెలిసింది.

డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా నితీష్‌ సీఎం జగన్‌ను ఫోన్‌లైన్‌లో కోరారు.రాజ్యసభలో వైఎస్సార్‌సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. 
 
కాగా సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది.

2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్‌ మరోసారి పోటీలో నిలిచారు.
 
జగన్‌కు బీజేపీ ఎంపీ కృతజ్ఞతలు
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments